జుంటె తేనె ధారల కన్నా
junte theene dhaarala kannaa
🎵 TG-1661🌐 Telugu
పల్లవి
జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా ||జుంటె తేనె||
1వ చరణం
యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే