జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
juntte teene dhaaralakanna yeesu naamamee madhuran
పల్లవి
యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా- యేసయ్యనే ఆరాధించెదా
1వ చరణం
యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
2వ చరణం
యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి - పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
3వ చరణం
యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే