జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

jyoothirmayudaa naa praanna priyudaa

🎵 TG-2160🌐 Telugu
పల్లవి

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2)           ||జ్యోతి||

1వ చరణం

నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద

Report Error