కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
kaanaraavee alanaati kanneeti praardhanalu
🎵 TG-1500🌐 Telugu
పల్లవి
కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు కదలవేమి అపవాది చెరసాల పునాదులు ఇది నీ లోపమా – మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంఘమా (2) ||కానరావే||
1వ చరణం
సమూయేలుల నందించే హన్నాలేరి సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా||
2వ చరణం
అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో దావీదులెటు పోయిరో నిద్ర లేవాలి ఓ సంఘమా అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా ఉజ్జీవం నీలో నిండాలి ఓ సంఘమా… నిజ సంఘమా