కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
kalllundi chuudaleeni endaroo unnaaru
🎵 TG-2732🌐 Telugu
పల్లవి
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి||
1వ చరణం
కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు ఇంకేల నా యేసయ్యా నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను నాకేగా పరలోకము