కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
kanaleenu prabhukeela shrama silvapai
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై మనలేను ప్రభు జూచి కఠినాత్మునై కఠినాత్మునై… ||కనలేను||
పాపులనేలేటి ప్రభునేలనో బల్లెంపు పోటుల బంధించిరి (2) కనుపించు పాపాలు రక్తాలలో ప్రభు బాధలో ముండ్ల కిరీటము ప్రభుకేలనో మూఢులు మోపిరి ప్రభు నెత్తిని ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా తన జంపు శత్రువుల క్షమియించెను క్షమియింపుమని తండ్రిని వేడెను క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను భరియించెను మోయజాలని సిలువ మోయించిరి దివినేలు బాహువులు బంధించిరి నా పాపమంతయు ప్రభు మోసెను జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో చేదు చిరక త్రాగను అందించిరి ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను సిలువొందెను తన ఆత్మ తండ్రికి సమర్పించెను తనదంతా తండ్రితో చాచుంచెను తలవంచి తండ్రిలో తుది చేరెను కను మూసెను లోకాలనేలేటి ప్రభువేలనో ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో సిలువేసెనో