కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన
kanneelllathoo pagilina gundethoo alasina
🎵 TG-1429🌐 Telugu
పల్లవి
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు||
1వ చరణం
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా