కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా
karunninchi thirigi samakuurchu prabhuvaa
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2) క్షమాపణ నిన్ను వేడుచున్నాను దావీదు రాజు దీనుడై వేడ అవనిలో బొందిన నష్టములన్నియు దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి||
శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి పసరు గొంగళి – చీడ పురుగులు నాశనము చేసిన పంటను కూర్చుమా యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టముల నెన్నియో బొందితి ఆత్మ దేవా నీవు సమకూర్చుమా పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా కోపగించక నాపై కృప జూపుమా చేసిన పాపము కప్పుకొనక విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువ రక్తముతో శుద్ధి చేయుమా