కరుణించుము మము పరమ పితా
karunninchumu mamu parama pithaa
🎵 TG-2835🌐 Telugu
పల్లవి
కరుణించుము మము పరమ పితా శరణం నీవే ప్రభు యేసా (2) హల్లెలూయా హల్లెలూయా యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||
1వ చరణం
రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి