కట్టెలపై నీ శరీరం కనిపించదు
kattelapai nee shareeram kanipinchadu
🎵 TG-1984🌐 Telugu
పల్లవి
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై||
1వ చరణం
దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా||
2వ చరణం
ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును