కొండల తట్టు నా కన్నులు
kondala thattu naa kannulu
🎵 TG-2858🌐 Telugu
పల్లవి
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును కలుగును భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
1వ చరణం
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును నా రాకపోకలయందును – కాపాడి రక్షించును వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా