కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను

kooti kaanthula velugulathoo udayinchenu

🎵 TG-2785🌐 Telugu
పల్లవి

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)    ||కోటి కాంతుల||

1వ చరణం

రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే –

Report Error