పల్లవి
గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా
1వ చరణం
రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా (2) హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా "కోటి"
2వ చరణం
యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా (2) జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్ "కోటి"
3వ చరణం
సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా (2) ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా "కోటి"