క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం

kraisthava jeevitham saubhaagya jeevitham

🎵 TG-1627🌐 Telugu
పల్లవి

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2) కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి (2)          ||క్రైస్తవ||

1వ చరణం

ఈ లోక ఘనత నన్ను విడిచినన్ లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ నా సహోదరులు నన్ను విడిచినన్ యోసేపు దేవుడే నా సహకారి అంధకారంబు భువి నావరించిన రాజులు ఘనులు శత్రువులైనను అగ్ని గుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ బూర శబ్దంబు మ్రోగెడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు ఆనాటి వరకు నే కనిపెట్టెదన్

Report Error