క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే
kreesthee sarvaadhikaari – kreesthee
🎵 TG-2278🌐 Telugu
పల్లవి
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే||
1వ చరణం
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన