క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి

kreestheesu prabhuvu thana rakthamichchi

🎵 TG-1337🌐 Telugu
పల్లవి

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకము వారిది (2)      ||క్రీస్తేసు||

1వ చరణం

అపొస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే (2) ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు సంఘములో నిలిచెదరు పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచెదరు ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్తానమును వారు పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకము నందు

Report Error