క్రిస్మస్ కాలం క్రీస్తు జననం
krismas kaalam kreesthu jananam
🎵 TG-2627🌐 Telugu
పల్లవి
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2) ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||
1వ చరణం
పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో యూదా గోత్రములో – ఒకతార కాంతిలో కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా