కృప వెంబడి కృపతో నను

krupa venbadi krupathoo nanu

🎵 TG-2256🌐 Telugu
పల్లవి

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా (2) నను కరుణించిన నా యేసయ్యా (2)         ||కృప||

1వ చరణం

నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||

2వ చరణం

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని విడువని ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా

Report Error