కృపామయుడా – నీలోనా

krupaamayudaa – neeloonaa

🎵 TG-1781🌐 Telugu
పల్లవి

కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపామయుడా||

1వ చరణం

చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసెదను (2)       ||కృపామయుడా||

2వ చరణం

నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపామయుడా||

3వ చరణం

ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను

Report Error