కృపగల దేవా దయగల రాజా

krupagala deevaa dayagala raajaa

🎵 TG-1809🌐 Telugu
పల్లవి

కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2)       ||కృపగల||

1వ చరణం

త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే (2) జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు

Report Error