కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో

kuthuhalamaarbaatamee naayeesuni sannidhiloo

🎵 TG-1048🌐 Telugu
పల్లవి

కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో ఆనంద మానందమే నాయేసుని సన్నిధిలో

1వ చరణం

పాపమంతపోయెను రోగమంత తొలగెను - యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృపద్వార రక్షణ - పరిశుద్ధాత్మలో ||కుతుహలమార్బాటమే నాయేసుని||

2వ చరణం

దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయము నేనే ఆత్మతోను దేవుడు గుర్తించె నన్ను - అద్భుత మద్భుతమే ||కుతుహలమార్బాటమే నాయేసుని||

3వ చరణం

శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు - జయం పై జయమిచ్చును ఏకముగా కూడీ హోసన్నా పాడి - ఊరంతా చాటెదము ||కుతుహలమార్బాటమే నాయేసుని||

4వ చరణం

బారధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది - మహిమలో ప్రవేశిద్ధాం ||కుతుహలమార్బాటమే నాయేసుని||

Report Error