కుతూహలం ఆర్భాటమే – నా
kuthuuhalam aarbhaatamee – naa
🎵 TG-1815🌐 Telugu
పల్లవి
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||
1వ చరణం
పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో ||కుతూహలం ||
2వ చరణం
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము