లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది

lemmu teejarillumu niiku - velugu vachchiyunnaadi

🎵 TG-1218💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యెహోవా మహిమ నీపై - ప్రాకాశముగా నుదయించె "లెమ్ము"

1వ చరణం

జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయ - కాంతీకి వచ్చెదరు"లెమ్ము"

2వ చరణం

సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము - నీ యెద్దకు వచ్చును "లెమ్ము"

3వ చరణం

దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు తేబడును నీదు పాద - స్థలము మహిమ పరచెదను "లెమ్ము"

4వ చరణం

నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్‌ బహు తరములకు సంతోష - కారణముగా జేసేదన్‌ "లెమ్ము"

5వ చరణం

వారిలో ఒంటరియైనా - వాడు పది వందాలగును ఎన్నీక లేని వాడు - బలమైనట్టి జనమగును "లెమ్ము"

Report Error