మాకు తోడుగ నీవుంటివి జీవిత
maaku thooduga neevuntivi jeevitha
🎵 TG-2445🌐 Telugu
పల్లవి
మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో (2) మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు||
1వ చరణం
మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని||
2వ చరణం
శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము