మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది

maanavuddaa kaaranna janmuddaa ? nii janmaku kaarannamundi

🎵 TG-1171💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు - 2 పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని - 2 || మానవుడా ||

1వ చరణం

పువ్వులెందుకు? కాయలెందుకు ? ఋతువులెందుకు ? కాలాలెందుకు ? ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 2 గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో - 2 నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ || మానవుడా ||

2వ చరణం

సూర్యుడెందుకు? చంద్రుడెందుకు రాత్రులెందుకు? పగలు ఎందుకు? - 2 రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2 ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి - 2 పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ || మానవుడా ||

Report Error