మానవులందరు ఒక్కటేనని మదిలో మన

maanavulandaru okkateenani madiloo mana

🎵 TG-1942🌐 Telugu
పల్లవి

మానవులందరు ఒక్కటేనని మదిలో మన దేవుడు ఒక్కడేనని (2) అందరు అందురు – వీనుల విందుగా (మరి) లోకాన జరిగేది మార్పుగా (2)      ||మానవులందరు||

1వ చరణం

క్రీస్తు సిలువకు సాక్షులమందురు సాక్ష్యములిచ్చినా సాకులు మానరు ప్రార్ధనకొచ్చినా పాపం మానరు ప్రభువేల వానిని క్షమియించును మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు||

2వ చరణం

మార్పులు చెందినా మాటలు మారవు మనుషులు కలిసినా మనసులు కలువవు చేతులు కలిపినా హృదయం కలవదు పైపైకి వందనంబులనుదురు మరి వారేల నీతిమంతులవుదురు

Report Error