మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
maarani deevudavu neeveenayyaa - marugai undaleedu neeku yeesayyaa
🎵 TG-1163🌐 Telugu
పల్లవి
మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
1వ చరణం
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
2వ చరణం
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||