మార్గం సత్యం జీవం నీవే
maargam sathyam jeevam neevee
🎵 TG-1959🌐 Telugu
పల్లవి
మార్గం సత్యం జీవం నీవే యేసు సర్వం సకలం నీవే క్రీస్తు (2) మా ఆధారం నీవేనయ్యా మా అనుబంధం నీతోనేనయ్యా వధియింపబడిన ఓ గొర్రెపిల్ల ప్రభువైన మా యేసువా మా స్తుతి స్తోత్రముల్ నీకే మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం||
1వ చరణం
పరమును విడిచావు మాకై నరునిగా పుట్టావు ధరపై ఆహా నీదెంత ప్రేమ ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప||
2వ చరణం
కలువరిలో రక్తమును కార్చి విలువగు ప్రాణమును ఇచ్చి తెచ్చావు భువికి రక్షణ ఇచ్చావు పాప క్షమాపణ