మార్గము చూపుము ఇంటికి

maargamu chuupumu intiki

🎵 TG-2494🌐 Telugu
పల్లవి

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము ||మార్గము||

1వ చరణం

ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2)     ||మార్గము||

2వ చరణం

దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2)        ||మార్గము||

3వ చరణం

కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును

Report Error