మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ

maarpuchendavaa neevu marpuchendavaa nee

🎵 TG-1749🌐 Telugu
పల్లవి

మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||

1వ చరణం

దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే

Report Error