మార్పులేని మానవుండా తీర్పుదినం దాగలేవు
maarpuleeni maanavunddaa tiirpudinan daagaleevu
పల్లవి
సోదరా తీర్పుదినం దాగలేవురా
1వ చరణం
మారు మనస్సు నొందని నీ తీరును జీవ గ్రంధమందు లేని పేరును అసహ్యించుకొనును ద్వేషించును ఎరుగడనుచు యేసు నిను ఎంచును బాసించును ||మార్పు||
2వ చరణం
ఘోర పాపిగ నీవు కనబడి నేరస్తుడిగా నీవు నిలబడి త్రోయబడి నరకాన కూలబడి కాలబడి పోదువు ఖాయము హేయము ||మార్పు||
3వ చరణం
రక్షణ యేసు నొద్ద నున్నది నిర్లక్ష్యం నీ యొద్ద నున్నది ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అందుము పొందుము ||మార్పు||
4వ చరణం
సిలువ రక్తము వృదా చేయకు చేజేతుల ఉరి వేసుకు చావకు మన ఘన ధన పరలోకం మరువకు వెరవకు ||మార్పు||