మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు
mahimagala thandri - manchi vyavasaayakudu
🎵 TG-1167🌐 Telugu
పల్లవి
మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను - కాపుగావుంచాడు (2) కాయవే తోట - కమ్మని కాయలు పండవే చెట్టా - తియ్యని ఫలములు ||కాయవే||
1వ చరణం
నీతి పూత జాతికాపు - ఆత్మశుద్ది ఫలములు నీ తండ్రి నిల్వచేయు - నిత్య జీవ నిదులు అనంతమైన ఆత్మ బందు - అమరసుఖ శాంతులు అనుకూల సమయిమిదే - పూయు పరమ పూతలు (2) ||కాయవే||
2వ చరణం
అపవాది కంటబడి - కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు - గంపలుగా కాయకు వెర్రిగా చుక్కలంటి - ఎదిగి విర్రవీగకు అదిగో గొడ్డలి వేరున - పదును పెట్టియున్నది (2) ||కాయవే||
3వ చరణం
ముద్దుగా పెంచాడు - మొద్దుగా నుండకు ముదముతో పెంచాడు - మోడుబారిపోకు ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడిపోకు పండ్లుకోయువాడు వచ్చి - అగ్నివేసి పోతాడు ||మహిమగల తండ్రి||