మంచివాడు గొప్పవాడు నా యేసు

manchivaadu goppavaadu naa yeesu

🎵 TG-2001🌐 Telugu
పల్లవి

మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2) ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2)      ||మంచివాడు||

1వ చరణం

ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2)        ||ఆదరణ||

2వ చరణం

ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో

Report Error