మందిరం ప్రభుని మందిరం - సుందరమైనది చూడదగినది

mandiran prabhuni mandiran - sundaramainadi chuuddadaginadi

🎵 TG-1280💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మరపురానిది మరువజాలని - పరిశుద్ధమైనది పావనమైనది

1వ చరణం

మనుష్యుల చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడినది సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది ఈ మందిరం ||మందిరం||

2వ చరణం

అన్యజనులలో కదలిక కలిగెను కదిలిరి వారు కానుకలతో అర్పించిరి తమ ఇష్ట వస్తువులు నింపిరి మహిమతో ఈ మందిరమును ||మందిరం||

3వ చరణం

కష్టపడిరి తన సేవకులంతా నష్టమనక మన దేవుని పనికై పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ఈ మందిరం ||మందిరం||

4వ చరణం

మునుపటి మందిరము కన్న మించినదై కడవరి మందిరము మహిమతో నింపబడె కనబడుచున్నది కాంతివంతముగా నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||

Report Error