మంగళమే యేసునకు – మానుజావతారునకు
mangallamee yeesunaku – maanujaavathaarunaku
🎵 TG-1667🌐 Telugu
పల్లవి
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే||
1వ చరణం
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే దురిత సంహారునకు – వర సుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞాన దీప్తునకు మంగళమే సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు నిత్య స్వయంజీవునకు నిర్మలాత్మునకు మంగళమే యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి సత్య పరంజ్యోతి యగు సార్వభౌమునకు మంగళమే నర ఘోర కలుషముల – నురుమారంగ నిల కరుదెంచిన మా పాలి వర రక్షకునకు మంగళమే పరమపురి వాసునకు – నర దైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను మంగళమే