మనిషి బ్రతుకు రంగుల వలయం
manissi brathuku rangula valayam
🎵 TG-2893🌐 Telugu
పల్లవి
మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణ భంగురం (2) మారాలి ప్రతి హృదయం వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి||
1వ చరణం
గడ్డి పువ్వురా మనిషి జీవితం గాలి వీచగా రాలిపోవును గాలిలో నిలువని దీపమురా ఇది గాలిలో ఎగిరే గాలిపటం రా తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని ఆత్మ వెళ్లగా శవమని నిన్ను ఇంట నుంచరు పంచ చేర్చెదరు ఇరుగు పొరుగువారు కూడ కొందరు వల్లకాటి వరకే వచ్చెదరు ధనమున్నదని గర్వించకురా ధనమే నీకు తోడు రాదురా లోకమే నీకు అశాశ్వతంబురా పరలోకమే నీకు శాశ్వతంబురా (2) ||మనిషి||