మణులు మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న
mannulu maannikyamulunna - meedamiddulu yennunna
🎵 TG-1165🌐 Telugu
పల్లవి
మణులు మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న మధిలో యేసు లేకున్నా - ఏది వున్న అది సున్నా
1వ చరణం
చదువులెన్నో చదువున్నా - పదవులెన్నో చేస్తున్నా విద్యవున్న బుద్ధివున్న - జ్ణానమున్నా అది సున్నా ||మణులు||
2వ చరణం
అంద చందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకయున్నా - అందమున్నా అది సున్నా ||మణులు||
3వ చరణం
రాజ్యములు రమణులువున్నా - శౌర్యములు వీర్యములున్నా బలము వున్న బలగమున్నా - ఎన్ని యున్నా అవి సున్నా ||మణులు||
4వ చరణం
పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్య కార్య సిద్ధుడా దాన ధర్మము తపము జపము - యేసు లేనిది అది సున్నా ||మణులు మాణిక్యములున్న||