మణులు మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న

mannulu maannikyamulunna - meeddamiddulu yennunna

🎵 TG-1164💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మధిలో యేసు లేకున్నా - ఏది వున్న అది సున్నా

1వ చరణం

చదువులెన్నో చదువున్నా - పదవులెన్నో చేస్తున్నా విద్యవున్న బుద్ధివున్న - జ్ణానమున్నా అది సున్నా "మణులు"

2వ చరణం

అంద చందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకయున్నా - అందమున్నా అది సున్నా "మణులు"

3వ చరణం

రాజ్యములు రమణులువున్నా - శౌర్యములు వీర్యములున్నా బలము వున్న బలగమున్నా - ఎన్ని యున్నా అవి సున్నా "మణులు"

4వ చరణం

పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్య కార్య సిద్ధుడా దాన ధర్మము తపము జపము - యేసు లేనిది అది సున్నా

Report Error