మరువని నీదు ప్రేమతో కాచితివే

maruvani needu preemathoo kaachithivee

🎵 TG-1614🌐 Telugu
పల్లవి

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)       ||మరువని||

1వ చరణం

కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు

Report Error