మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా

meelainaa keedainaa neethoonee yeesayyaa

🎵 TG-2581🌐 Telugu
పల్లవి

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2)      ||మేలైనా||

1వ చరణం

కలిమి చేజారి నను ముంచినా స్థితిని తలక్రిందులే చేసినా రెండింతలుగా దయచేసెదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా పరుల ఎగతాళి శృతి మించినా కలవరము పొంది నే కృంగినా నా మొర విని కృప చూపెదవని శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా ఆపదలలో విడిపించెదవని

Report Error