మేము భయపడము – ఇక

meemu bhayapadamu – ika

🎵 TG-1383🌐 Telugu
పల్లవి

మేము భయపడము – ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2)      ||మేము||

1వ చరణం

దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే (2) దీవారాత్రులు దేవుడే కాయును ||మేము||

2వ చరణం

శత్రు కోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్ నిత్యుడు యేసు నిత్యము కాయును అగ్ని పరీక్షల యందు వాగ్ధానమిచ్చె మాతో నుండ ఏ ఘడియైనను విడువక కాయును బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి పలు విధములుగా కాపాడు మమ్ము కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు కను పాపగా మము కాపాడునెప్పుడు జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ దేవుడొసంగిన ఈవుల నెంచుచు ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్ మహిమపరచి మ్రొక్కెదములలో

Report Error