మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
mellani challani svaramu yeesayyadee
🎵 TG-1343🌐 Telugu
పల్లవి
మెల్లని చల్లని స్వరము యేసయ్యదే ఉల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని||
1వ చరణం
శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా మంచిదంతటిని మాటతో చేసెను పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము పావనపరచెడి పరిశుద్ధుని స్వరము స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం కుళ్ళిన శవమునందు జీవమును పోసెను పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో గాలి తుఫానులన్ అణచిన స్వరమది భీతి భయములన్ని బాపెడి స్వరమది అంత్య దినమందున మృతుల లేపునుగా అందరికి తీర్పును తీర్చి పాలించును మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా