మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
menee menee ttekeel uphaarsiin menee menee ttekeel uphaarsiin
పల్లవి
వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో
1వ చరణం
న్యాయమైన త్రాసులో నిను తూచును ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును రాజగు బెల్షేజరు తెలిపోయును మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో ||మెనే||
2వ చరణం
సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే||
3వ చరణం
ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే||