మోయలేని భారమంత సిలువలో మోసావు

mooyaleeni bhaaramantha siluvaloo moosaavu

🎵 TG-2437🌐 Telugu
పల్లవి

మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు – కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2)        || మోయలేని ||

1వ చరణం

జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తీర్చిరి ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ

Report Error