నా ఆశల పల్లకి నీవే
naa aashala pallaki neevee
🎵 TG-2423🌐 Telugu
పల్లవి
నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా ఆశ నీవయ్యా ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే దాహము తీర్చావని ||యేసయ్యా||
1వ చరణం
దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే తోడుగ ఉన్నావని స్నేహితులు లేరని – తోడెవరు రారని నా మనసు నాలోన – దుఃఖించు సమయాన నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు ఆదరించావయ్యా