నా చిన్ని హృదయము నిన్నే
naa chinni hrudayamu ninnee
🎵 TG-2220🌐 Telugu
పల్లవి
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ నిను చాటనీ – నిను ఘనపరచనీ నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని||
1వ చరణం
కావలివారూ వేకువకై చూచునట్లు నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా నా ప్రాణము నిన్నే ఆశింపనీ పనివారు యజమాని చేతివైపు చూచునట్లు నా కన్నులు నీపైనే నిలచియుండనీ