నా దేహమును నీ ఆలయముగా

naa deehamunu nee aalayamugaa

🎵 TG-2290🌐 Telugu
పల్లవి

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును||

1వ చరణం

నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము నా దేహమును భయముతో భక్తితో నీ కొరకు పరిశుద్ధముగా దాచెద ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించును ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను విస్తారముగా దేవా ఫలియింతును నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు

Report Error