నా దీపము యేసయ్యా నీవు

naa deepamu yeesayyaa neevu

🎵 TG-1834🌐 Telugu
పల్లవి

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా (2)        ||నా దీపము||

1వ చరణం

మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా

Report Error