నా దేవుని గుడారములో
naa deevuni gudaaramuloo
🎵 TG-1799🌐 Telugu
పల్లవి
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) ఎంతో సంతోషం – ఎంతో ఆనందం నా యేసుని నివాసములో (2) ||నా దేవుని||
1వ చరణం
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా నా కొండ నీవేగా – నా కోట నీవేగా నా యేసు రక్షకా నీవే కదా నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను నా గానమాయెనే – నా ధ్యానమాయెనే నాదు స్వరము నా ప్రభువే ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా నా యేసు నాథుడా నీవే కదా