నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
naa diipamu yeesayyaa niivu veliginchinaavu
పల్లవి
సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము
1వ చరణం
ఆరని దీపమై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ - వెలిగావు నిండుగా "నా దీపము"
2వ చరణం
మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా "నా దీపము"
3వ చరణం
ఆగని హోరులో ఆరిన నేలపై నాముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా "నా దీపము"